గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌..

166
kcr cm
- Advertisement -

గోల్కొండ కోటపై నుండి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు.

- Advertisement -