ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించనున్న సీఎం..

799
formationday
- Advertisement -

జూన్ 2 రాష్ట్ర అవరతణ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రం వచ్చి 5సంవత్సరాలు పూర్తై ఆరవ వసంతం లొకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్ వద్ద 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొననున్నారు. ఇక జిల్లాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు, జెడ్పీ చైర్‌పర్సన్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అవతరణోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహాల్, రవీంద్రభారతి, కళాభవన్‌లో కవిసమ్మేళనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

- Advertisement -