- Advertisement -
అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రస్ధాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాళ్లవానతో నష్టపోయిన పంట వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని తేల్చిచెప్పారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుధవారం లేదా గురువారం రాళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. రాళ్ల వాన వల్ల వాటిల్లిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికలను పరిశీలించి, నిర్ణయం తీసుకుని ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాలో పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -