సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన..

306
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాళేశ్వరం వెళ్లనున్నారు.హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకోనున్న సీఎం…రిజర్వాయర్లో నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకోవడంతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. బ్యారేజ్ పరిసరాల్లో సుమారు 4 గంటల పాటు పర్యటించి, పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశనం చేయనున్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం గుడిలో దైవ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ చేయనున్నారు. తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

kcr

సీఎం కేసీఆర్‌ పర్యటనను పురస్కరించుకొని.. కాళేశ్వరం ఆలయం, లక్ష్మీబరాజ్‌ దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, జిల్లా ఇంచార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, రామగుండం సీపీ సత్యనారాయణ, ఇతర అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. రామగుండం సీపీ సత్యనారాయణ కాళేశ్వరం దేవాలయం వద్ద హెలిప్యాడ్‌ ఏర్పాటును పర్యవేక్షించారు. లక్ష్మీబరాజ్‌ వద్ద సుమారు 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ నేతృత్వంలో చేపడుతున్నారు. 

- Advertisement -