- Advertisement -
రేపు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ఉదయం 6:50 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద ఉన్న పంప్ హౌస్ వద్దకు చేరుకుని పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 7:45 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
- Advertisement -