పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ రివ్యూ…

108
kcr
- Advertisement -

పల్లెప్రగతి, పట్టణప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్‌ కార్యాచరణపై ఇవాళ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే సమావేశానికి స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఆహ్వానించారు.

సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదలచేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు.ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -