టీఆర్ఎస్ నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీ ప్రారంభం నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఈ కీలక సమావేశం ఉండనుంది. మంత్రులతో పాటు టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొననున్నారు. పార్టీ పేరు, అజెండా వంటి అంశాలపై చర్చించనున్నారు.
దసరా రోజు జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ నెల 6 లేదా 7న బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. దసరా రోజున పలు రాష్ట్రాలకు చెందిన రైతులు, కార్మిక సంఘాలు, పలు పార్టీల నేతలను ప్రగతిభవన్‌కి ఆహ్వానించనున్నట్లు సమాచారం.
పార్టీకి భారత రాష్ట్రీయ సమితితో పాటు నవ భారత్ పార్టీ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి కూడా గులాబీ జెండాతో పాటు కారు గుర్తే ఉండాలని భావిస్తున్నారు. జాతీయపార్టీ ప్రకటన తర్వాత ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది.