ముంబైలో సీఎం కేసీఆర్..మహా సీఎంతో భేటీ

51
kcr
- Advertisement -

మోడీ సర్కార్ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ జాతీయ నాయకులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌తో భేటీ అయ్యేందుకు ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసంలో ఠాక్రేతో భేటీకానున్నారు.

సాయంత్రం 4 గంటలకు శరద్‌పవార్‌తో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కుల్లో మితిమీరుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటం లో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ముఖ్యమం త్రి కేసీఆర్‌.. ఠాక్రే, పవార్‌తో చర్చించనున్నారు.

- Advertisement -