టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు విశాఖలో పర్యటించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు చేరుకున్నారు. భువనేశ్వర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఇక ఈ సాయంత్రం 6.30గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో బీజేడీ అధినేతతో కేసీఆర్ భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి ఒడిశా సీఎం నవీన్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు.
కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం కేసీఆర్ సోమవారం పూరీ జగన్నాథుని దర్శనం చేసుకుని కోణార్క్ దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి భువనేశ్వర్ చేరుకొని సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. ఫడరల్ ఫ్రంట్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం సాయంత్రం కేసీఆర్ సమావేశం కానున్నారు.