5వేల మంది రైతులతో సీఎం కేసీఆర్ సమావేశం…

172
kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు రేపు (అక్టోబర్ 31న) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 12.30గంటలకు రైతు వేదికను ప్రారంభించనుండగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. అనంతరం రైతు వేదిక వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు.

ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. 2,604 క్లస్టర్లను ఏర్పాటు చేసింది.

- Advertisement -