ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలల నేతృత్వంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే ముప్పై కి పైగా పార్టీలు సభ్యత్వం కలిగి ఉండగా ఇండియా కూటమిలో 20కి పైగా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు కూటమిల విధానాలు నచ్చని పార్టీలు చాలానే ఉన్నాయి. దాదాపు దేశాన్ని అరవై ఏళ్ళకు పాలించిన కాంగ్రెస్ హయంలోనూ, ఇటు గత పదేళ్ళ నుంచి అధికారంలో ఉన్న బీజేపీ హయంలోనూ దేశంలో అభివృద్ది పరంగా చెప్పుకోదగ్గ అంశాలేవీ చోటు చేసుకోలేదు..
దాంతో అటు ప్రజలు కూడా ఈ రెండు పార్టీల పట్ల అసంతృప్తి గానే ఉన్నారు. అయినప్పటికి కేంద్రంలో ఈ రెండు పార్టీలు తప్పా ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ లేదా బీజేపీ గానే దేశ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అయితే థర్డ్ ఫ్రంట్ వస్తే దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం. దీనికి మంచి ఉదాహరణ ఇటీవల దేశ రాజకీయాల్లోకి బిఆర్‌ఎస్ ఎంట్రీ ఇచ్చిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలే. బిఆర్‌ఎస్ కు దేశంలో అనూహ్యంగా ఆధారణ పెరుగుతోంది. మహారాష్ట్రలో అక్కడి స్థానిక పార్టీలకు కూడా పోటీ ఇచ్చేలా బిఆర్‌ఎస్ బలం పెంచుకుంటోంది. అటు బిహార్ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా బిఆర్‌ఎస్ కు అనుకూల పవనాలు విస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కేసిఆర్ సారథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం దొరికినట్లేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు,. మరి ముందు రోజుల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ లకు చెక్ పెట్టేందుకు సికేఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.
Also Read:మైనంపల్లికి దారులు మూసుకుపోతున్నాయా?