రాష్ట్రంలోని బ్రహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 18 మంది సభ్యులతో తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్‌ని ప్రభుత్వం ఏర్పాటుచేయగా దీనికి రిటైర్డ్ ఐఏఎస్ కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. ఈ సంక్షేమ పరిషత్ ద్వారా బ్రహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.
ఇక రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని బ్రహ్మణ సదనం భవనం కోసం కేటాయించింది ప్రభుత్వం. 2017 జూన్ 5న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
Also Read:సావర్కర్ పాత్ర కోసం 26కేజీలు తగ్గిన హీరో..!
మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సద నం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనున్నది. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు కేసీఆర్.
Also Read:శృంగారంలో స్త్రీలు చెప్పే అబద్దాలివే!