- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది. ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో గ్రేటర్ ఎన్నికలు, సన్న ధాన్యానికి మద్దతు ధర, రెవెన్యూ, పురపాలక సంబంధిత చట్టసవరణలు, బడ్జెట్ మధ్యంతర సమీక్ష, నీటిపారుదలశాఖ పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం.
- Advertisement -