- Advertisement -
ఈ నెల 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
- Advertisement -