తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి ఖాళీగా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు రేపు ఆఖరు తేదీ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్.
ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి, ఫరీ దుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, బొడకుంట వెంకటేశ్వర్లు, నేతి విద్యా సాగర్ కు పదవీ కాలం ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో మధుసూధనాచారి, తాడూరి శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్, కడియం శ్రీహరి లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ ,కోటి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.