ఈనెల 25న 6వ విడత హరితహారం ప్రారంభం

387
- Advertisement -

ఈ నెల 25వ తేదిన 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిపునరుద్దరణలో భాగంగా మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రతీ 30కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. కాగా గత 5విడతలుగా చేస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -