పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పం

114
kcr
- Advertisement -

దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ ఒడిశాలోని పూరి తీరంలో సీఎం కేసీఆర్ సైకత శిల్పం వెలిసింది.

దేశ్ కి నేత.. కిసాన్ కా భరోసా.. కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ నేత అలిశెట్టి అర్వింద్ ఆధ్వర్యంలో సైకత శిల్పి సాహు దీనిని రూపొందించారు. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని.. అదే తరహాలో దేశ భవిష్యత్ మార్చగల శక్తి కేసీఆర్‌లో ఉందంటూ నమ్మకం వ్యక్తం చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ రైతులు, ఇతర వర్గాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే కాంగ్రెస్, బీజేపీ పాలన వైఫల్యమేనని.. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడ్డారని చెప్పారు.

- Advertisement -