రెండోదశ మెట్రోకు శంకుస్థాపన

244
- Advertisement -

నాగోల్ – రాయదుర్గం కారిడార్‌ – 3కు కొనసాగింపుగా రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ దశలో రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31కి.మీ), బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌ (26 కి.మీ.), నాగోలు-ఎల్‌బీనగర్‌ (5 కి.మీ.) మొత్తం 62 కిలోమీటర్లు విస్తరించేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.6,250 కోట్లతో రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులను చేపట్టింది. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని మూడేండ్లలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 8-9 స్టేషన్లు ఉండనున్నాయని, కార్గో లైన్‌, ప్యాసింజర్‌ లైన్‌ వేర్వేరుగా ఉంటాయని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మూడేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -