తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు సీఎం కేసీఆర్. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్..కొండపోచమ్మ సాగర్ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలఘట్టం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు సీఎం.భూ నిర్వాసితుల కోసం విశేష కృషి జరుగుతుందన్నారు సీఎం.భూ నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కారం తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అన్నారు.
ఏ లక్ష్యాన్ని ఆశించి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టామో ఆ లక్ష్యం నేడు నెరవేరిందన్నారు. ప్రత్యామ్నాయ గజ్వేల్ సృష్టి జరుగుతోందన్నారు. ఎస్సారెస్పీ తర్వాత పెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ అన్నారు సీఎం.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. మూడు నాలుగేళ్లలో 165 టీఎంసీల రిజర్వాయర్లు సాధించామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే అందులో తెలంగాణ నుండే 53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు.
త్వరలోనే సమ్మక్క సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కూడా పూర్తికాబోతుందన్నారు. ఒక సంవత్సరంలో
లక్ష కోట్ల పండే పరిస్ధితి రాబోతుందన్నారు. త్వరలో రైతులకు శుభవార్తనందించబోతున్నానని తెలిపారు సీఎం. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో దేశం మొత్తం షాక్ కాబోతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కష్టపడిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూల్ చేశారు సీఎం కేసీఆర్.పేరున్న కంపెనీలన్నీ కాళేశ్వరం కోసం పనిచేశాయని తెలిపారు సీఎం. ప్రాజెక్టు గురించి వార్తలు రాసిన జర్నలిస్టులను అభినందించారు.