దేశానికే ఆదర్శంగా తెలంగాణ న్యాయశాఖ: సీఎం కేసీఆర్

75
cm kcr
- Advertisement -

తెలంగాణ న్యాయశాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు సీఎం కేసీఆర్. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 30 ఎకరాల్లో క్వార్టర్స్‌ నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు.

న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని వెల్లడించారు.

- Advertisement -