భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతం- సీఎం కేసీఆర్‌

40
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాదాద్రి జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదని.. తెలంగాణ వచ్చాకే అది సాధ్యం అయ్యిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.. దివంగత ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదని సీఎం తెలిపారు. ఈరోజు భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతం. ఇక్కడ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించడం సంతోషంగా ఉంది. భువనగిరిలో ఇప్పుడు 2-3 కోట్ల వరకు భూముల విలువలున్నాయి..మారుమూల ప్రాంతాల్లోనూ 20లక్షలకు పైనే భూముల ధరలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాగనూర్‌ మండల కేంద్రంలో అక్కడ భూమి ఎవరు అడగపోతేది. అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదు. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4లక్షలు, రూ.5లక్షలు ఉంటే.. మన ప్రాంతంలో రూ.25లక్షలకు తక్కువ లేదని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి చెప్పిండు. మారు మూల ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌ అడవి జిల్లా, అచ్చంపేట, నారాయణపేట జిల్లాలో భూముల ధరలు పెరిగాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -