దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీకి ప్రైవేటైజేషన్ అనే పిచ్చి పట్టిందన్నారు. తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని కానీ పెట్టనని తెగేసి చెప్పానన్నారు.
ఇల్లందు పొరాటల పురిటిగడ్డ అన్నారు. ఎన్నికలు వస్తాయి..పోతాయి కానీ ఎవరు ఏం చేస్తారు..ఏ పార్టీ మంచి చేస్తుందో ఆలోచించాలన్నారు. మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులు జరుగుతాయన్నారు. ప్రజలు చైతన్యంతో ఓటు వేయాలన్నారు. రైతు బంధు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ఓటు వేసే ముందు పరిణతితో ఆలోచించాలన్నారు.
మేనిఫెస్టోలో పెట్టింది పది పనులు కానీ చేసింది వంద పనులు అన్నారు. ఇవాళ మారుమూల ప్రాంతాలకు తాగు నీరు అందిస్తామన్నారు. రైతులకు పోడు భూములు ఇచ్చామన్నారు. ఇల్లందులో 15 వేల కుటుంబాలకు 48 వేల 300 ఎకరాలు అందించామన్నారు. పోడు భూముల ఇవ్వడమే కాదు పోలీస్ కేసులను ఎత్తి వేశామన్నారు. పోడు భూములకు రైతు బంధు ఇచ్చామన్నారు. ఇల్లందులో గ్రామాల రోడ్లు బాగు చేసుకున్నామన్నారు.స్వరాష్ట్రంలో కరెంట్ బాధలు పోయాయని చెప్పారు.
ఏ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగిందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. హరిప్రియ నాయక్ చెప్పిన డిమాండ్‌లన్ని నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారని వారికి ఓటు ద్వారా బుద్దిచెప్పాలన్నారు.
Also Read:ఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు