KCR:కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రాజ్యమే

31
- Advertisement -

తెలంగాణ చారిత్రాక వైభవానికి ప్రతీక వరంగల్ అన్నారు సీఎం కేసీఆర్. భద్రకాళి మాత ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. అమ్మవారికి కీరిటదారణ చేసి మొక్కులు కూడా చెల్లించామన్నారు. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, మిషన్ కాకతీయ పేరుతో చెరువులు బాగు చేసుకున్నామన్నారు. వరంగల్ ఈస్ట్,వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు.

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. ఉన్న తెలంగాణ 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు వెనక్కి పోయాం అన్నారు. ఎన్నో కష్టాలు పడి తెలంగాణను సాధించుకున్నాం… అలా సాధించుకున్న తెలంగాణను ఈ పదేళ్లు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అన్నారు. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నారు.

కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నో బాధ‌లు అనుభ‌వించినం.. ఇప్పుడు మ‌ళ్ల ఆ బాధ‌లు కొని తెచ్చుకోవ‌ద్దు. ఇందిర‌మ్మ రాజ్యం తెస్త‌ర‌ట‌. యెన్క‌టికి ఒక‌ని త‌ద్దినానికి పిలిస్తే.. ప్ర‌తిరోజు మీ ఇంట్ల ఇట్ల‌నే జ‌ర‌గాల‌ని దీవెన పెట్టిండంట‌.. ఇప్పుడు ఇందిర‌మ్మ రాజ్యం అంటే ఎవ‌రికి కావాలి ఆలోచించాలన్నారు. ఆ ముక్కిపోయిన‌, ములిగిపోయిన, మందిని చావ‌గొట్టిన ఆక‌లి రాజ్యం కావాల్నా..? బ్ర‌హ్మాండంగా రెండు, మూడు పంట‌లు పండిచి, మ‌న నీళ్లు, మ‌న గాలి మ‌న‌కు ద‌క్కి, మ‌న క‌రెంట్ మ‌న‌కు ద‌క్కి ద‌ర్జాగా బ‌తికేట‌టువంటి రాజ్యం కావాల్నా..? ద‌య‌చేసి ఆలోచించాలన్నారు.

రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వ‌స్తాయ‌ని అనుకుంటున్న‌రని… ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు.. మూడో తారీఖు మ‌ళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్ర‌హ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం అన్నారు.

Also Read:తలనొప్పిలో ఈ లక్షణాలుంటే.. ప్రమాదమే!

- Advertisement -