దేశానికే దిక్సూచిగా తెలంగాణ: సీఎం కేసీఆర్

182
trs kcr
- Advertisement -

20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. 2001, ఏప్రిల్ 27న స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయంలో జలదృశ్యంలో గులాబీ పతాకాన్ని ఎగురవేశామని తెలిపారు.

పార్టీ ఆవిర్భవించిన రోజుల్లో ఎన్నో నీలినీడలు,అపోహల మధ్య గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఆరోజు తనతో పాటు నడిచిన కొద్దిమంది మిత్రుల్లో మధుసుధనాచారి ఒకరన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా, రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే చెప్పానని అది సాకారాం చేసి చూపించానని తెలిపారు. తెలంగాణను అడ్డుకునేందుకు సమైక్యవాదులు చేయని కుట్రలు చేశారని తెలిపారు. చివరి దశలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని కానీ పట్టువదలకుండా ముందుకుసాగడం వల్ల విజయతీరాలకు చేరామన్నారు. రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నామని తెలిపారు.

ప్రపంచ ఉద్యమాలకే తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప భాష్యాన్ని చెప్పిందన్నారు. శాంతియుతంగా ఉద్యమాలను ఎలా నడపాలో తెలంగాణ ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఎంతోమంది కేంద్రమంత్రులు తెలంగాణ అద్భుత పాలన సాగిస్తుందని కొనియాడారన్నారు.తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, పరిపాలన చేత కాదని, వ్యవసాయం కుంటుపడుతుందని, ధరలు పడిపోతాయని,పరిశ్రమలు తరలిపోతాయని ప్రచారం చేశారు కానీ వాటన్నింటిని తేటతెల్లం చేస్తూ అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉందన్నారు. పంజాబ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో తలదన్ని వరి పంటలో అగ్రగామిగా నిలిచామన్నారు. ఇది ఏడేళ్లలో తెలంగాణ సాధించిన ఘనత అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో కూడా అగ్రగామిగా ఉన్నామని, కరోనా సంక్షోభాన్ని అధిగమించి 11.5 శాతం వృద్ధిరేటుతో ఆర్ధిక రంగంలో తెలంగాణ పురోగమించిందన్నారు. తెలంగణ పల్లె, పట్టణ ప్రగతి అద్భుతాన్ని ఆవిష్కరించిదన్నారు. ఇంటింటికీ మంచినీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్ర నుండి కూలీలు వలసకు వచ్చే పరిస్ధితి వచ్చిందన్నారు. తెలంగాణ పథకాలు అనేక రాష్ట్రాల్లో కాపీ కొట్టే పరిస్ధితి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

ఏపీలో కూడా టీఆర్ఎస్‌ పార్టీని స్ధాపించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని అవస్థలు పడ్డామో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. ఏడేళ్లలో ఇంతటి అభివృద్ధి సాధించి అందులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు సీఎం కేసీఆర్.

- Advertisement -