పంజాబ్‌లో కొన్నట్టుగా తెలంగాణలో ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం…ధాన్యం కొనుగొలు చేపట్టేవరకు ఆందోళన చేపడతామన్నారు.
ఈ యుద్దం ఇంతటితో ఆగిపోదు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామన్నారు. రైతులను న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని…ఉత్తర భారత రైతులను కలుపుకుని ముందుకుసాగుతామన్నారు. నాతో సహా రాష్ట్ర మంత్రులు అంతా కేంద్రానికి పలుమార్లు లేఖ రాసిన వారి నుండి స్పందన లేదన్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు.