CM KCR:ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే

58
- Advertisement -

తెలంగాణ పరిపాలను గుండెకాయగా నిర్మించబడిన సచివాలయాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టమన్నారు సీఎం కేసీఆర్. సచివాలయం ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం…ఎన్నో పోరాటాల అనంతరం రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు సీఎం. సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. ఇవాళ తెలంగాణ సాధించిన ప్రగతికి ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు.

తెలంగాణలోని పల్లెలు అన్నిరకాలుగా అభివృద్ధి చెందాయన్నారు.అందరి సహకారంతో రాష్ట్రం అద్భుతంగా ప్రగతి సాధించిందన్నారు. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని దానికోసం బోధించు,సమీకరించు,పోరాడు అని సూచించిన విశ్వమానవుడు బీఆర్ అంబేద్కర్ అన్నారు. వారి సందేశంతోనే శాంతియుత మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నారు. ఆ సమతా మూర్తి సూచించిన బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. అంబేద్కర్ సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆదర్శం అన్నారు. ఇటీవలె అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో అంకితభావంతో పనిచేయాలనే నూతన సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టామన్నారు. ఆయన చూపిన బాటలోనే నడుస్తామన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులైన అమరులకు నివాళి అర్పించారు సీఎం. అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తుకు తెలంగాణ ఎదిగిందన్నారు. తెలంగాణ పునర్మిమాణం అంటే చెరువులను పునరుద్దరించడం అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువుతు మత్తడి దుంకుతున్నాయన్నారు. తెలంగాణలో జీవ,ఉప నదులు ఉన్నాయన్నారు. తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుత కృషితో సాగునీటి సమస్య తీరిందన్నారు. ఆనాడు నెర్రెలు బారిన నేలు ఇవాళ హరిత క్రాంతి ప్రభతో ప్రజ్వలిస్తున్నాయన్నారు.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

తెలంగాణ పునర్మిమాణం అంటే కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోథల పథకం, 24 గంటల కరెంట్,వ్యవసాయానికి ఉచిత కరెంట్ అన్నారు.గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా ప్రగతి సాధించాయన్నారు. అటవీ శాఖ అధికారుల పట్టుదలతో విస్తీర్ణం పెరిగిందన్నారు. కొల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకున్నామన్నారు. వలస పోయిన పాలమూరు బిడ్డలు తిరిగి తమ స్వంత స్థలాలకు వచ్చారన్నారు. ఒకనాడు దాహంతో అల్లాడి, ఫ్లోరైడ్‌తో అల్లాడిన రాష్ట్రంలో మిషన్ భగీరథతో ఆ సమస్య తీర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది మరుగుజ్జులు చేస్తున్న అసత్యాలను ఈ సందర్భంగా ఎండగట్టారు సీఎం. ఐటీ, ఇండస్ట్రీ విధానంలో తెలంగాణ టాప్ అన్నారు. కళ్లున్న కబోదులకు. మరుగుజ్జులకు తెలంగాణ పునర్మిమానం గురించి తెలియదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్.

Also Read:వైసీపీనే టార్గెట్..బాలయ్యతో బోయపాటి!

- Advertisement -