CM KCR:సంగారెడ్డికి మెట్రో తీసుకొస్తాం

63
- Advertisement -

ఎన్నికల తర్వాత పెన్షన్‌ను రూ. 5 వేలకు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ఆయన వెనకున్న పార్టీని చూసి ఓటే వేయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు.

ఎన్నికల తర్వాతే అసలు కథ మొదలవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి సాధించామన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పాలనలో ప్రజలు హరిగోసపడ్డామన్నారు.

కాంగ్రెస్ పాలనలో రూ. 200 పెన్షన్ ఉంటే ఇప్పుడు రూ.2 వేలు పెన్షన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర సంపద పెరిగిన కొద్ది పెన్షన్ పెంచుకుంటూ పోయామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 24 గంటల పాటు ఉచితంగా నీటిని అందిస్తామన్నారు. సంగారెడ్డిలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాడు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారన్నారు.ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని వారినే బంగాళాఖాతంలో కలపాలన్నారు. ఇందిరమ్మ రాజ్యమే సక్కగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లు, ఆకలి చావులు అన్నారు. సంగారెడ్డికి మెట్రో వస్తే భవిష్యతే మారిపోతుందన్నారు.సంగారెడ్డికి మరిన్ని కాలేజీలు తీసుకువస్తామన్నారు.

Also Read:రైతు బంధును ఆదరించండి..రైతు రాబంధును తరిమికొట్టండి

- Advertisement -