ప్రేమతో బతికేటటువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన కేసీఆర్…అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.
నా వయసు 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భవిష్యత్ మీది.. ఈ భారతదేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీ పైనే ఉందన్నారు. మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్యను కూడా పెంపొందించుకోవాలన్నారు.
ఈ దేశం చాలా గొప్ప దేశం… సహనశీలత దేశం. అవసరమైన సందర్భాల్లో త్యాగాలకు సిద్ధపడే దేశం అన్నారు. పూలబోకే లాంటి గొప్ప దేశంలో కొంతమంది స్వార్ధపరులు చేసే కుట్రలు ఏ మాత్రం సమర్ధీనయం కాదని తెలిపారు.