మంత్రి హరీష్‌పై తప్పుడు ప్రచారం

117
harishrao
- Advertisement -

ట్రబుల్ షూటర్, ఆర్ధికమంత్రి హరీష్ రావుపై ఓ మీడియా సంస్థలో అసత్యవార్తలు ప్రచురితం కాగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వార్త సారాంశం ఏంటంటే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో హరీష్‌ టచ్‌లో ఉన్నారని ఆయన తెలంగాణలో మరో ఏక్‌నాథ్ షిండే కానున్నారని చెప్పుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన హరీశ్‌ తిరుగుబాటు జెండా ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని తెలిపింది.

అయితే దీనిపై హరీశ్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. వాస్తవానికి హరీష్ వ్యక్తిత్వం అలాంటి కాదని..సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీకి సైనికుడని చెప్పుకొస్తున్నారు. హరీష్ సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు.

ఒకవేళ కేటీఆర్ సీఎం అయినా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని బహిరంగంగానే తెలిపారు. ఇక హరీష్‌పై ఇలాంటి పుకార్లు కొత్తేమీ కాదు. గతంలోనూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తే హరీష్‌ను ఎంపీగా నిలబెట్టి తనతో పాటే తీసుకెళ్తారని ప్రచారం జరిగినా అవన్ని పుకార్లేనని తెలిపోయింది. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన అభిమానులు చెబుతున్నారు.

- Advertisement -