ఏపీతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తాం-కేసీఆర్‌

303
CM KCR
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీకి పలువురు మంత్రులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, సోదర రాష్ట్రమైన ఏపీతో ఉల్లాసభరితమైన స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని క్యాబినెట్ తీర్మానించిందని, ఇది తెలుగు ప్రజలకు శుభవార్తగా భావిస్తున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ భవనాలను తెలంగాణకు అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం స్నేహహస్తం చాచిందని, దాన్ని తాము కొనసాగించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

గతంలో పొరుగు రాష్ట్రాలతో అనేక వివాదాలు ఉండేవని, ప్రతి రోజూ బస్తీ మే సవాల్ అన్నట్టుగా ఉండేదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిందని తెలిపారు. కర్ణాటకతో సమస్యలు సమసిపోయాయని, ఇటీవల మూడుసార్లు పరస్పరం నీళ్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పారు.

విజయవాడకు, మహారాష్ట్రకు వెళ్లి..ఇద్దరు సీఎంలను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతీయేటా 3వేల 500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. భేషజాలు పక్కన పెడతామని ఏపీ సీఎం జగన్ తనతో అన్నారని సీఎం చెప్పారు. ఏపీ సాగునీటి పారుదల అధికారులు చర్చించడానికి మన దగ్గరికి వస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రాకు కలిపి గోదావరిలో 1480 టీఎంసీల నీళ్ల వాటా ఉంది. తెలంగాణ, ఆంధ్రాకు కలిపి కృష్ణాలో 811 టీఎంసీల నీళ్ల వాటా ఉంది. గోదావరి, కృష్ణాలో కలిపి ఇరు రాష్ట్రాలకు 2300 టీఎంసీల నీళ్ల వాటా ఉంది. రెండు నదుల మిగులు జలాలు కూడా రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని సీఎం తెలిపారు. నికర, వరద జలాలు కలుపుకుని సుమారు 5వేల టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని వాడుకునే అవకాశం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో బిందెలు ఎక్కడ కనిపించవు అన్నాం అయిపోయింది.కోటి పై చిలుక ఎకరాలకు నీళ్లు అంధించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణము చేపడుతాం.ప్రతి దానికీ ప్రధానిని పిలువాల్సిన అవసరం లేదు.అన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేదు.మోడీతో ఎప్పుడు కూడా బంధం కొనసాగించలేదు. మాకు నచ్చిన చోట కేంద్రానికి మద్దతు ఇచ్చాము. నచ్చని చోట గట్టిగా ఆడిగాం.నీతి ఆయోగ్‌ను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.అన్ని రికార్డులు ఉన్నాయి.ప్రాజెక్ట్ లకు కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వాల్సిందే. అన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -