పెద్దపల్లిలో లక్ష మెజార్టీతో గెలవాలి:సీఎం కేసీఆర్

53
- Advertisement -

రాష్ట్రంలో నీటి తీరువాను పూర్తిగా రద్దు చేశామన్నారు సీఎం కేసీఆర్. పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. పెద్దపల్లి జిల్లా తెచ్చిన మనోహర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు.

రైతులు అప్పు తీరాలని రైతు బంధు పథకం తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు దుబారా అంటోందన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లాకో మెడికల్ కాలేజీ సాధించుకున్నామన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. గతంలో పాలించిన పాలకులకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాలేదన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కులం, మతం బేధం లేకుండా అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. ఎవరో చెప్పారని గుడ్డిగా ఓటు వేయవద్దన్నారు. కాంగ్రెస్ పాలనలో చేనేత, రైతు ఆత్మహత్యలు నిత్యం జరిగాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థీరికరణ జరిగి గ్రామాలు సల్లగా ఉండాలన్నారు.కాంగ్రెస్‌కు మరోసారి తెలంగాణ అప్పజెబితే ఆగం అవడం ఖాయమని…భుజంపై గొడ్డలి పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రెడీగా ఉన్నారన్నారు.రైతుల అప్పులు తీరాలని రైతు బంధు తీసుకొచ్చామన్నారు.ఓసీలకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read:పాపం ఈటెల.. భయం భయం!

- Advertisement -