KCR:దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

56
- Advertisement -

పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు సీఎం కేసీఆర్. పాలమూరుకు నీళ్లడిగితే కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం..పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలు లేవన్నారు.

బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణా ట్రిబ్యునల్‌లో వాటా తేల్చాలని డిమాండ్ చేశారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు తిరిగి పాలమూరుకు వలస వస్తున్నారన్నారు. ఆనాటి సీఎంలు పాలమూరును దత్తత తీసుకున్న జరిగిందేమీ లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా మారుతుందన్నారు.

పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నీటి వాటా తేల్చలేదన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖ రాసేందుకు పదేళ్ల సమయం సరిపోదా అన్నారు. మాకు ఎవరి వాటా అవసరం లేదు…మంది సొమ్ము అక్కర్లేదన్నారు.తెలంగాణ నీటి వాటా తేల్చాలంటే ప్రధాని మోడీ స్పందించలేదన్నారు. బీజేపీ జెండాలు పట్టుకుని ఎవరైనా వస్తే వారిని నిలదీయాలన్నారు. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను కేటాయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు రావాల్సిన వాటాను లెక్కగట్టి ప్రాజెక్టులను కడుతున్నామన్నారు.గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు, కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరుకు అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా రాష్ట్రాన్ని సాధించానని గుర్తుచేశారు సీఎం.

Also Read:చంద్రబాబుకు సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

- Advertisement -