CM KCR:యువత బీఆర్ఎస్‌కు అండగా నిలవాలి

44
- Advertisement -

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.మళ్లీ బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది. నవంబర్ 30న యువ‌కులు ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క ఓటు పోల్ చేయించాలి. ఇది పోరాటాల పురిటి గ‌డ్డ‌.. దైవ‌భ‌క్తి ఉన్న గ‌డ్డ‌, పోత‌న పుట్టిన గ‌డ్డ‌, బంద‌గీ, దొడ్డి కొముర‌య్య, చాక‌లి ఐల‌మ్మ పుట్టిన గ‌డ్డ పాల‌కుర్తి గడ్డ.. మీరంతా పోరాటానికి వారసులు. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.

తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి.. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతదని ప్రశ్నించారు.తెలంగాణలో నేను రెండేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తానని ఆనాడు అసెంబ్లీలో చెబితే నాటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి రెండేండ్లలో కాదు..నాలుగేండ్లలో ఇచ్చినా కూడా నా మెడలో కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుంటానన్నడు. నేను ఇచ్చిన మాట మీద నిలబడి రెండేండ్లలో 24 గంటల కరెంటు ఇచ్చిన. కానీ జానారెడ్డి మాత్రం తన మాట మీద నిలబడలేన్నారు సీఎం కేసీఆర్.

రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Also Read:మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం!

- Advertisement -