KCR:ప్రతీ ఎకరాకు నీరందిస్తాం

43
- Advertisement -

మహారాష్ట్రలో ప్రతీ ఎకరాకు నీరందిస్తాం అన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర కాందార్‌ లోహలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం..స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్‌, బీజేపీలతో మన బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్‌ 54 సంవత్సరాలు, బీజేపీ 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నిధులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? అని ప్రశ్నించారు. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు అన్నారు.

మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయన్నారు. 125 ఏళ్ల పాటు విద్యుత్‌ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉంది అయినా ఎందుకు విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారు అన్నారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రణామం… పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతం తెలిపారు. దేశంలో త్వరలో తుఫాన్‌ రాబోతోంది… దాన్నెవరూ ఆపలేరు అన్నారు. అంబేద్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -