దేశంలో గుణాత్మక మార్పు తెస్తాం: సీఎం కేసీఆర్

18
- Advertisement -

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రెండేళ్లలో గుణాత్మక మార్పు తీసుకొస్తామన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం.. చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 75 ఏండ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని చెప్పారు. దేశంలో అవసరానికి మించి జల సంపద ఉందని..అయినా వాటిని ఉపయోగించుకునేలా కేంద్రం పాలసీ తేవడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయదన్నారు.

చైనా, రష్యా, ఈజిప్టు వంటి దేశాల్లో వేల టీఎంసీల కెపాసిటీతో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని..కానీ దేశంలో అలాంటి ప్రాజెక్టు ఒక్కటీ లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంకి వచ్చేందుకు గతంలో అనేక పార్టీలు అబద్దాలతో ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.

దేశంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ ను సరఫరా చేశామన్నారు. లండన్, న్యూయార్క్ లో కరెంట్ పోయినా..హైదరాబాద్ లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామన్నారు. దేశంలో 4 లక్షల 10 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని చెప్పారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు అత్యధికంగా 2 లక్షల 15వేల మెగా వాట్ల విద్యుతే ఉత్పత్తి చేసిందన్నారు. ఎక్కడా కూడా దేశంలో 24 గంటల విద్యుత్ ప్రజలకు అందడం లేదన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -