KCR:మంథని అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు

40
- Advertisement -

మంథని అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. మంథని ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్….బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఉద్యమం నుండి తన వెంట ఉన్న నాయకుడని…ఆయన్ని గెలిపిస్తే మంథని అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

ప్ర‌జాస్వామ్య దేశంలో ఉండే వ‌జ్రాయుధం ఓటు. ఆ ఓటును ఆషామాషీగా, అల‌వోక‌గా, డ‌బ్బులు ఇచ్చార‌ని వేయొద్దు అన్నారు. విచ‌క్ష‌ణ‌తో ఆలోచించి ఓటేయాలి. మ‌నం బాగా ఆలోచించి, ప‌ది మందితో చ‌ర్చించి నిజ‌మేందో, అబ‌ద్ధ‌మేందో నిర్ణ‌యించాలన్నారు. మీ ఓటు ఐదేండ్ల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుందన్నారు. అభ్య‌ర్థితో పాటు ఆయన వెనుకున్న పార్టీ గురించి ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యే గెలుపుతో రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్త‌ది. ఏ ప్ర‌భుత్వం ఉంటే బాధ్య‌త‌తో ప‌ని చేస్త‌ది అని ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలన్నారు.

రాష్ట్రం సాధించేందుకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్..మాకు బాస్‌లు ఢిల్లీలో లేరన్నారు. ప్రజలే మా బాస్‌లని… వేరే బాస్‌లు ఉండ‌రన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లే ఏం కోరుతారు, ఆకాంక్ష‌లు ఏంటో బీఆర్ఎస్‌కు మాత్ర‌మే తెలుసు అన్నారు. ఢిల్లీ బాస్ ఉంటే.. కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ చూస్తున్నారు అన్నారు. త కాంగ్రెస్ ఏం చేసింది.. బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Also Read:కాంగ్రెస్ లో మంట.. చీలిక ఖాయమేనా?

- Advertisement -