తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని, మన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కోన్నారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచి నీళ్లందిస్తున్నం. ఈ ఏడాది డిసెంబర్ కల్లా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ అందుతాయి. వచ్చే యాసంగి నుంచి రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిచడానికి తీవ్రమైన కృషి జరుగుతున్నది. ఇటీవల పాత మెదక్, కరీంనగర్, నల్గోండ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రయోగత్మాకంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నది.
విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అభివృద్దిని సాధించింది. నిమిషం కూడా కోత విధించకుండా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేస్తున్నాం. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్దిని వేగవంతం చేస్తున్నది. వ్యవసాయ రంగానికి పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నాం. నిరుపేదలు, నిస్సాహయలకు కనీస భద్రత కలిగించేందుకు ఆసరా పథకం ద్వారా పెన్షన్ ఇస్తున్నాం. 21.7 శాతం వృద్ది రేటుతో తెలంగాణ అగ్రస్థానంలో నిలించింది.
కేజీ టూ పీజీ కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మూడేళ్లలోనే 552 గురుకుల పాఠశాలలను నిర్మించినమన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నం. ఒక్కో విద్యార్థి మీద లక్షా 25వేలు ఖర్చు చేస్తున్నం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసేందుకు కృషి చేస్తున్నం. మంచి చేస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. గర్బిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్‌లను అందిస్తున్నం. రెండున్నర నెలల్లోనే 48 వేల మందికి కేసీఆర్ కిట్లు అందించినం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని సీఎం తెలిపారు. పేకాట, గుడుంబాను అరికట్టినం. షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.