పుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్

194
Yeleti to direct Jr NTR
- Advertisement -

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.  గత మూడు సంవత్సరాల నుంచి మనోడు వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు.  ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు..అందుకోసం డైటింగ్ కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఈ మద్య  చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాడట..వెంటనే ఆ సినిమా చేసేద్దాం అని చెప్పాడట.  అయితే  దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సింది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేస్తున్న జై ల‌వ‌కుశ చిత్రం రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. సెప్టెంబ‌ర్ 21న మూవీ విడుద‌ల కానుంది.

త్రివిక్రమ్ సినిమా తరువాత చంద్రశేఖర్ సినిమానే కాకుండా మరో హిట్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా కూడా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇలా తన కొత్త కథలతో వచ్చే ఏడాది అంతా కొత్త కథలుతో సాహసంగా మన ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -