గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సెల్యూట్..

64
- Advertisement -

గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వసతులు ఉన్నా లేకున్నా.. పీపీఈ కిట్స్‌ ఉన్నా లేకున్నా.. చాలాధైర్యంగా పని చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను రిజెక్ట్‌ చేస్తే ఇక్కడికి తీసుకువస్తే ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికి దక్కుతుందన్నారు.

గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టింపజేయడం చాలా గొప్ప విషయం… శ్రీనివాస్‌ యాదవ్‌, ఆయన మిత్రులందరికీ చిరస్థాయిగా కీర్తిదక్కుతుందన్నారు. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని దడదడలాంచిన సందర్భంలో రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున అత్యంత ధైర్యంగా, బలోపేతంగా ప్రజల ప్రాణాలను కాపాడుతామని ధైర్యంగా పని చేసిన సంస్థ మన గాంధీ ఆసుపత్రి అని కొనియాడారు.

మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యఫలితం. మహాత్ముడు ఎంత గొప్పవాడో.. ఆయన ప్రతిపాదించిన అహింశా, శాంతి, సేవ, తాగ్యనీరతి అనే సిద్ధాంతం ఎన్నటికైనా సార్వజనీనమైన, విశ్వజనీనమైన శాశ్వతమైన సిద్ధాంతం అన్నారు. గాంధీ పుట్టి, పెరిగి, స్వాతంత్య్ర పోరాటాన్ని సవాల్‌గా స్వీకరించే సందర్భంలో జరుగుతున్న చరిత్ర సింహావలోకనం చేసుకుంటే తెలుస్తుందన్నారు.

- Advertisement -