CM KCR:ఆ ఒక్కసారే ఓడిపోయా

36
- Advertisement -

నా జీవితంలో ఒక్కసారే ఓడిపోయా…కాదు ఓడించబడ్డానన్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం…ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…నేను ఓడిపోయినప్పుడు నా వ‌య‌సు 25 ఏండ్లు. అప్పుడు బ్యాలెట్ సిస్టం ఉంటుండే. ఎల‌క్ట్రానిక్ మేషిన్లు లేకుండే. ఓ ఐదారు వేల ఓట్లు నాకు వ‌చ్చిన‌వి దాంట్ల క‌లిపేసిండ్రు. క‌లిపేసి 700 ఓట్ల‌తోని ఓడిపోయిన‌ట్లు డిక్లేర్ చేసిండ్రు అని చెప్పారు సీఎం.

తర్వాత తాను నిలిచిన ప్రతీ ఎన్నికలోనూ గెలిచానని చెప్పారు.పాలమూరు అయినా కరీంనగర్ అయినా..గజ్వేల్ అయినా ప్రజలు ఆదరించాన్నారు. స‌మైక్య రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు, క‌రెంట్ విష‌యంలో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయం ప‌ట్ల నాటి ముఖ్య‌మంత్రులను ప్ర‌శ్నించిన విష‌యాన్ని సీఎం కేసీఆర్ వివ‌రించారు.
నాడు ఎన్నిక‌లు రాగానే.. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు టికెట్లు ముందు ఇచ్చేవార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ద‌గ్గ‌ర ఉంట‌దనే నెపంతో లాస్ట్‌కు ఇచ్చేవారు. ఓ ఎల‌క్ష‌న్ల మా నాన్న చ‌నిపోతే నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు. మీ టికెట్ ఫైన‌ల్ అయిందంట‌.. వచ్చి ఫారాలు తీసుకొని వెళ్ల‌మ‌ని ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని డీఎస్పీ వ‌చ్చి నాకు చెప్పిండు. తెల్లార‌గానే హైద‌రాబాద్ వ‌చ్చాను అన్నారు.

అనేక అవ‌రోధాలు అధిగ‌మించి, పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మీ అంద‌రితో మ‌న‌వి చేసేది ఒక్క‌టే.. గ‌జ్వేల్ అభివృద్ధి అయింది అంటే అయింత ముఖం కొడుత‌ది.. దిష్టి కొడుత‌ది మ‌న‌కు. కావాల్సింది చాలా ఉంది.. జ‌ర‌గాల్సి ఇంకా ఉంది. ఎందుకంటే రాజ‌కీయ నాయ‌కులు ఎప్పుడు కూడా రిలాక్స్ కావొద్దు. ఇంకేం కావాలో ఆలోచించాలి త‌ప్ప‌.. అయిన‌దాంతో సంతృప్తి ప‌డొద్దు అన్నారు. సాధించిన దానితో సంతృప్తి ప‌డి సంబురాలు చేసుకోవ‌డం కాదు.. భ‌విష్య‌త్‌ను ఇంకా మార్గ‌నిర్దేశ‌నం చేసుకోవాలి. ఇంకేం చేయాలో ఆలోచించాలని సూచించారు.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -