దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్ధి ఆల వెంకటేశ్వర్ రెడ్డి అలియాస్ చెక్ డ్యామ్ వెంకటేశ్వర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. పట్టుబడ్డి 30 చెక్ డ్యాంలు మంజూరు చేయించి లక్ష ఎకరాల్లో వరి పంట పండించారని…. మంచి నాయకుడు. ఐదు గంటలు వేచి ఉన్నారంటనే ఆయన విజయం ఖాయమైందని చెప్పారు.
కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయని ఇది అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉందన్నారు. తక్కువ నష్టంతో ఎక్కువ నీళ్లు రావాలి.. గుట్టల వద్ద రిజర్వాయర్ ఉండాలని స్వయంగా పరిశీలన చేశాను. ఆ తర్వాత కరివెన రిజర్వాయర్‌ను కట్టుకున్నాం. రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయన్నారు.
పెన్షన్, రైతుబంధు ఎంత పెంచుతాం.. సన్నబియ్యం ఎలా ఇస్తామనేది మీ కండ్ల ముందుందన్నారు. చెక్‌డ్యామ్‌లు, కాలువలు, డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి ఇండ్ల గురించి అడిగారు తప్పా.. మరేం అడుగలేదు. ఆయన కోరిన కోర్కెలను గవర్నమెంట్ మళ్లీ వచ్చాక నెరవేర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
Also Read:CM KCR:పేదల సంక్షేమమే మా ధ్యేయం