KCR:డిసెంబర్ 6 నుండి రైతు బంధు

39
- Advertisement -

చేవేళ్ల దళిత వాడల నుండి దరిద్య్రాన్ని తరిమేద్దాం అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. చేవేళ్ల ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..రైతు బంధును ఆపిన కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ చేసిన పనితో రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు రైతు బంధు ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్‌ వాళ్లే రైతుబంధును ఆపారు.. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వాళ్లు పిచ్చిపనులు చేస్తున్నారన్నారు. రైతుబంధు ఆపితే ఓట్లు వస్తాయనే దురాలోచన కాంగ్రెస్‌ది అన్నారు. రైతు బంధు డిసెంబర్ 3 వరకు ఆపగలుగుతారు తర్వాత డిసెంబర్ 6 నుండి రైతు బంధు ఇచ్చితీరుతామన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని ప్రచారం చేశారు కానీ ఎవరూ ఊహించని విధంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయన్నారు.

రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని..రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు చేతికే అధికారం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యమే అవుతుందన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని..కాలె యాదయ్యను మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు.

Also Read:CM KCR:అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం..

- Advertisement -