KCR:తెలంగాణలో శాశ్వతంగా కరెంట్ సమస్య ఉండదు

34
- Advertisement -

వ్యవసాయ స్థీరికరణ కోసం అనేక చర్యలు తీసుకున్నాం అన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం భైంసా ప్రజా ఆశీర్వదా సభలో మాట్లాడిన సీఎం…ఎనికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగం కావడం ఖాయమన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ధరణిని బంగాళాఖాతంలో కలపాలని చూస్తోందని మండిపడ్డారు. దరణిని తీసెస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ప్రజలు ఆలోచించి పార్టీ, అభ్యర్థిని చూసి ఓటు వేయాలన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ అంటోంది..3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ అంటున్నారు. కాబట్టి ఎవరి పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రైవేటైజేషన్‌ అనే పిచ్చి పట్టుకుందన్నారు. అందుకే రైతు మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని చెబితే ప్రాణం పోయినా పెట్టనని చెప్పారు. మోటార్లకు మీటర్ పెట్టనందుకు రూ.25 వేల కోట్లు మనకు రావాల్సిన ఫండ్ ఇవ్వలేదన్నారు. రైతులు బాగుపడాలి, పల్లెలు బాగు పడాలన్నదే తమ విధానమన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు. ఓట్లు అడగానికి వచ్చే బీజేపీ నేతలను నిలదీయాలన్నారు.

Also Read:భారత్ విక్టరీపై ఆనంద్ మహీంద్రా

పల్లె, పట్టణ ప్రగతితో మంచి ప్రగతి సాధించామన్నారు. భైంసా పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. కులం, మతం తేడా లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న వారి జీవితాల్లో ఎందుకు వెలుగులు నింపలేకపోయిందని ప్రశ్నించారు. దళిత బంధు తెచ్చిందే సీఎం కేసీఆర్ అని…ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి తీరుతామన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతోందని కర్ఫ్యూ, కల్లోలం లేదని, మతపిచ్చితో కొట్లాటలు లేవన్నారు. స్ధానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు.

- Advertisement -