కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారన్నారు సీఎం కేసీఆర్. ఆందోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు..మూడో తారీఖు తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం అన్నారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతుబంధుపై కాంగ్రెస్, బీజేపీల దొంగ నాటకాన్ని రైతులు గమనిస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీలకి కర్రు కాల్చి వాత పెడతరన్నారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని…రైతుబంధును ఆదరించండి..రైతు రాబంధును తరిమికొట్టాలన్నారు. తెలంగాణను ముంచి ప్రజలను గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. 69లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్లా కాల్చి చంపారన్నారు. ఓటు మన తలరాతను మారుస్తుంది…కాబట్టి ఆలోచించి అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ఆ అభ్యర్థి వెనకున్న పార్టీ గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచామన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్‌ని రూ.5 వేలకు తీసుకుపోతామని చెప్పారు. కంటి వెలుగు ద్వారా కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించిన 20 లక్షల మందికి అద్దాలిచ్చామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయం చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ స్థీరికరణ జరగాలని రైతు బంధు, రైతు భీమా తీసుకొచ్చామన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరు ఇస్తే పన్నులు వసూలు చేయడం సాధారణమని కానీ తెలంగాణలో పన్ను వసూలు చేయడం లేదన్నారు.
Also Read:రైతుబంధు బ్రేక్.. కుట్ర ఎవరిది?