ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ పాత్ర కీలకం:సీఎం కేసీఆర్

34
cm kcr

హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ రమణ పాత్ర కీలకమన్నారు సీఎం కేసీఆర్. నానక్ రామ్ గూడలోని పోనిక్స్ వీకే టవర్స్లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌(ఐఏఎంసీ)ను సీజేఐ రమణతో కలిసి ప్రారంభించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…హైదరాబాద్‌ అంటే రమణకు ఎంతో ప్రేమన్నారు. భార‌త‌దేశంలో ప్ర‌ప్ర‌థ‌మంగా హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావ‌డం, సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మ‌న‌ల్ని దీవించ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. హైద‌రాబాద్ సింగ‌పూర్ క‌న్నా బాగుంది అని చెప్పారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్ పురోగ‌మిస్తోంది. అనేక రంగాల్లో హైద‌రాబాద్ కేంద్ర బిందువుగా మారుతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు.

హైద‌రాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, న‌గ‌రానికి, మ‌న వ్య‌వ‌స్థ‌కు మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆర్డినెన్స్ ద్వారా చ‌ట్టాలు తీసుకొస్తామ‌న్నారు.