CM KCR:కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా?

46
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలన్నారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. తెలంగాణ రాకముందు అనేక సమస్యలు ఉండేవని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా వారం రోజుల లోపే అందిస్తున్నామన్నారు.

చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఆదిలాబాద్..అందుకే ఆలోచించి ఓటు వేయాలన్నారు.నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధితో పాటు ఆ పార్టీల చరిత్రను గమనించి ఓటు వేయాలన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు.

రైతుల సమస్యలు తెలిసిన ప్రభుత్వం కాబట్టే ధరణిని తీసుకొచ్చి వారి భూమికి రక్షణ కల్పించాలన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్‌కు..3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు.బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ అన్నారు. గతంలో సాగునీటిపై రైతులు పన్నులు కట్టేవారు…సాగునీటి తీరువాను రద్దు చేశామన్నారు. రైతు బంధుతో ధీమా, రైతు భీమాతో భరోసా కల్పిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాంరాం చెబుతుందన్నారు. ఉచిత కరెంట్ కావాలంటే జోగు రామన్నను గెలిపించాలన్నారు. రైతు బంధు కావాలా..? రాబందులాంటి కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. జోగు రామన్న ప్రజల కోసం పరితపించే వ్యక్తం అన్నారు.జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించండి..మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు.

Also Read:పిక్ టాక్ : సొగసు ఘాటు పెంచేసింది

- Advertisement -