గురువారం శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సభలో భట్టి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తప్పుబట్టారు.. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలి అన్నారు. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం. కేంద్రంలో రూరల్ డెవపల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండవు. మొన్ననే క్లియర్‌గా చెప్పినా. ఈ దేశంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలను సంప్రందించి, స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా పని చేయాలని ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలని ఐదేండ్లకు ఒకసారి రెకమెండ్ చేస్తారు. అవి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు.. కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు అని స్పష్టం చేశారు. కొన్ని ట్యాక్స్‌లు కేంద్రం, రాష్ట్రం వసూలు చేస్తోంది.
కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నుంచి క్రమానుగతంగా, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. కేంద్రం పోస్టు మ్యాన్‌లా మాత్రమే పని చేస్తోంది. కేంద్రం నిధులు అనేవి ఉండవు. కేంద్రం నిధులు ఇస్తుందనడం సరికాదు. ప్రభుత్వ, సమాజ నిర్వహణలో పంచుకోబడ్డ బాద్యతల్లో కొన్ని పనులు కేంద్రం, కొన్ని పనులు రాష్ట్రం చేస్తుంది. భట్టి విక్రమార్క ప్రశ్నకు తమ వద్ద అద్భుతమైన సమాధానం ఉందన్నారు సీఎం కేసీఆర్.