కమీషన్ల కోసమే నాగర్జునాసాగర్ కట్టారా..?: సీఎం కేసీఆర్

156
cm kcr
- Advertisement -

పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం …కాంగ్రెస్,బీజేపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగనట్లు ప్రవర్తిస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని చెప్పారు. తమ సహనానికి హద్దు ఉంటుందని హద్దు మీరితే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. చాలా మంది రాకాసులతో కొట్లాడమని..ఈ గొకాసులు ఓ లెక్కా అని ఎద్దేవా చేశారు.

ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హతే లేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు, తెలంగాణ ఆగం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల బాధలు తీర్చేందుకే గులాబీ జెండా ఎగిరిందన్నారు. పదవుల కోసం, తమ స్వార్ధం రాష్ట్రాన్ని నాశానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.ఆనాడు జరిగిన వంచనకు కాంగ్రెస్ పార్టీ నేతలు కారణమని…పదవుల కోసం ప్రజలను అవస్తల పాలు చేశారని తెలిపారు. తాను ఉద్యమ నేతగా కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేశానని తెలిపిన కేసీఆర్…ఆ సమస్యలను ప్రస్తావనకు తెచ్చి పరిష్కారం అయ్యేలా చేశానని వెల్లడించారు. ఇవాళ ప్రాజెక్టులు కడుతుంటే కమీషన్ల కోసమే కడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని….. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమీషన్ల కోసమే కట్టారా కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి నీళ్లు ఇస్తుంటే కళ్లు మండిపోయే ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని చెప్పారు.

- Advertisement -