రాష్టం లో చాలా వరకు కరోనా ను అరికట్టినట్టు ,కృషి చేసిన ప్రతి అధికారికి,పోలీసుల కు ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం మన రాష్టం లో 1069 కేసులు ఉన్నాయని తెలిపారు.ఆగస్ట్ .సెప్టెంబర్ వరకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ మన రాష్టం లో తయారు చేస్తున్నారు అని తెలిపారు.నేటి నుండి భౌతిక దూరం గా భావిస్తూ పాటించాలని తెలిపారు. ముఖ్యం గా ఇతర వ్యాధులు ఉన్నవారు ,డయాబెటిస్,క్యన్సర్, గుండె జబ్బు,ఇతర జబ్బుల రోగులకు 3 నెలల సరిపడ మందులు అందచేయుట కు సర్వం సిద్ధమైంది. కరోనా పట్ల జోన్ల వారీగా 6 జిల్లాలో రెడ్ జోన్,లు మరో 11 రోజుల్లో గ్రీన్ జోన్లు గా పోతాయని తెలిపారు.రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్ ,రంగారెడ్డి, మేడ్చల్ లాల్లో 66 శాతం కేసులు ఇక్కడే ఉన్నాయి.కాబట్టి ప్రజలు తప్పకుండా సహకరించాలి,కావున 29 మే వరకు లాక్ డౌన్ పొగిస్తున్నటు కేసీఆర్ తెలిపారు .రాష్టం మొత్తం కర్ఫ్యూ తప్పకుండా ఉంటుందని తెలిపారు.సహకరించని వారి పై పోలీసులు కఠిన చర్యలు తీస్కుంటారని ,చాలా కఠినం గా లాక్ డౌన్ పాటించాలని కోరారు.
భారత ప్రధాని తెలిపిన విధంగా సడలింపు లు పాటిస్తూ ,రాష్ట్ర ప్రభుత్వం నియమాలు పాటించాలని తెలిపారు.ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది .వైద్య అవసరాలకు తప్ప బయటకు రాకుండ ఉండాలని కోరారు.నిత్యావసర సరుకుల కు ,గృహ నిర్మాణ ,సిమెంట్,స్టీల్ షాప్ లు ,వ్యవసాయ పనిముట్ల షాపులు తెరుచుకోవచ్చు.రెడ్ జోన్ లో ఎట్టి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరపకూడదు.రూరల్ ఏరియా లో గ్రీన్,అరేంజ్ జోన్లు లో మున్సిపాలిటీ లు, తప్ప మండల స్థాయిలో వాళ్ళు అన్ని షాపులు తెరుచుకోవచ్చు.సోషల్ డిస్టన్స్ పాటించని జిల్లాలో తప్పకుండా మళ్ళీ లాక్ డౌన్ చేపడ్తాము.రాష్టం లో అన్ని జిల్లాల్లో సాయంత్రం నుండి కర్ఫ్యూ తప్పనిసరి .పాటించని వారిపై చర్యలు తప్పవు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి.10 వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు హైకోర్టు ఆదేశాలు పాటిస్తాము.యువ న్యాయవాదులను,ఆదుకోనుటకు 15 కోట్లు ట్రస్ట్ గా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.అదేవిధంగా వలస కూలీలకు అండగా ఉంటామని తెలిపారు.రైతుల పట్ల అవగాహన లేని దిక్కుమాలిన నాయకులను రైతులు నమ్మకూడదని కోరుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.కేసీఆర్ ఉన్నత కాలం రైతు బంధు యధావిధిగా ఉంటుంది.మద్యం అమ్మకాలపై పై 16 శాతం పెంచనున్నటు ,చీప్ లిక్కర్ పై 11 శాతం పెంచనున్నటు తెలిపారు.మద్యం షాప్ వాళ్ళు నియమాలను పాటించని చో షాప్ ల పై చర్యలు కఠినమని తెలిపారు.ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుమతి.