కాంగ్రెస ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన భట్టి తీరుపై అసహం వ్యక్తం చేసిన సీఎం.. స్పీకర్‌ను కూడా నిర్దేశించే పద్ధతి భట్టి విక్రమార్కకు సరికాదన్నారు . సభలో ఇలా మాట్లాడటం భట్టి విక్రమార్కకు పరిపాటిగా మారిందన్నారు.
సభ్యులకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ టైమే ఇస్తున్నామని తెలిపిన సీఎం… సభకు రావొద్దని చెప్పే అవసరం తమకు ఎందుకుంటుందన్నారు. ఇలా మాట్లాడటాన్ని అంగీకరించము అని కేసీఆర్ స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ఉప సభాపతిగా కూడా పని చేశారు. సభా నిబంధనలు మన కంటే వారికే ఎక్కువ తెలుసు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై మనం చెప్పాల్సింది చెప్పాం….సభలో రాష్ర్టానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. మీ పార్టీ సభ్యులు.. పార్లమెంట్‌లో ఉన్నారు కాబట్టి.. కేంద్ర పరిధిలో వచ్చే విషయాలు అక్కడ మాట్లాడితే మంచిదని భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.
సభ్యుల సంఖ్యను బట్టి, సభా నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు. కేటాయించిన సమయం కంటే నాలుగైదు నిమిషాలు ఎక్కువగానే ఇస్తున్నాం. సభకు రావొద్దని మేమేందుకు చెప్తామని సీఎం అన్నారు.